౧
తకిట తక తక తకిట
చకిత పద యుగళా
నికట గంగా సహిత
మకుట గళ నిగళా
హరిహరాంచిత
కలా కలిత నీల గళా
సాంద్ర చ్చటా పటల
నిటల చంద్ర కళా
జయ జయ మహా దేవ
శివ శంకరా
హర హర మహా దేవ
అభయంకరా
౨
అని దేవతలు
శివుని కొనియాడ
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనంతలో కైలాస మావేళ
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల
౩
జగము లేలిన వాని
సగము నివ్వెర బోయె
సగము మిగిలిన వాని
మొగము నగవై పోయె
౪
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
౫
అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు
అనితర సాధ్యము పాశు పతాస్త్రము
కోరి ఇంద్రగిరి చేరి
శివునికై
అహోరాత్రములు
చేసెను తపస్సు
ఇది సృష్టించెను
దివ్య మహస్సు
౬
నెలవంక తలపాగ
నెమలి ఈకగ మారె
తల పైని గంగమ్మ
తలపు లోనికి బారె
నిప్పులుమిసే కన్ను
నిదురోయి బొట్టాయె
బూది పూతకు మారు
పులితోలు వలువాయే
ఎరుక గల్గిన శివుడు
ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారె
తాను ఎరుకతగా
ఓంకార ధనువుగా
ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి
కదలి వచ్చెను శివుడు
౭
శివుని ఆనతిని
శిరమున దాల్చి
మూకాసురుడను
రాక్షసుడు
వరాహ రూపము
ధరించి వచ్చెను
ధరా తలమ్మే
అదిరి పోవగా
౮
చిచ్చర పిడుగై
వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో
అర్జునుడు
మట్టు పెట్టగా
పట్టె బాణము
ధనువొక చేతను
అందుకొని
చూసిన కంటను
చూడకనే
గురి చూసినంతనే
వేసినంతనే
౯
తలలు రెండుగా
విల విల లాడుచు
తనువు కొండగా
గిర గిర తిరుగుచు
అటు ఇటు తగిలిన
రెండు బాణముల
అశువులు వీడెను
వరాహము
౧౦
కొట్టితి నేనని
అర్జునుడు
పడగొట్టితి నేనని
శివుడూ
పట్టిన పట్టును
వదలకనే
తొడ గొట్టిన
బీరముతో అపుడూ
౧౧
వేట నాది
వేటు నాది
వేటాడే చోటు నాది
ఏటి తగవు పొమ్మని
విలు మీటి పలికే శివుడు
చేవ నాది
చేత నాది
చేటెరుగని
ఈటె నాది
చేవుంటే రమ్మని
కను సైగ చేసె
అర్జునుడు
౧౨
గాండీవ పాండిత్య కళలుగా
బాణాలు కురిపించె అర్జునుడు
కాని
అపుడతడు
వేయి చేతుల కార్త వీర్యార్జునుడు
ఓంకార ఘన ధనుష్టంకారముల తోడ
శర పరంపర కురిసె హరుడు
అయినా
నరుని కాతడు
మనోహరుడు
౧౩
చిత్రమేమొ
గురిపెట్టిన బాణమ్ములు
మాయమాయే
విధి విలాసమేమో
పెట్టిన గురి
వట్టిదాయే
అస్త్రములే విఫలమాయె
శస్త్రములే వికలమాయే
సవ్య సాచి కుడి ఎడమై
సంధించుట మరచిపోయే
౧౪
జగతికి సుగతిని
సాధించిన తల
దిగంతాల కవతల
వెలిగే తల
గంగకు నెలవై
కళ కాధరువై
హరి బ్రహ్మలకు
తరగని పరువై
అతి పవిత్రమై
అఘన మిత్రమై
శ్రీకరమై
శుభమైన
శివుని తల
అదరగా
సృష్టి చెదరగా
తాడి ఎత్తు
గాండీవము తో
ముత్తాడి ఎత్తుగా
ఎదిగి అర్జునుడు
చండ కోపమున
కొట్టినంతనే
౧౫
తల్లి దండ్రుల చలువ
తనువైన దేవుడు
కోరిన వరాలిచ్చు
కొండంత దేవుడు
ఎదుట నిలిచెను శివుడు
ఎద లోని దేవుడు
పదము లంటెను నరుడు
భక్తి తో అపుడు
౧౬
కర చరణ కృతం వా
కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా
మానసం వాపరాధం
విహిత మవిహితం వా
సర్వమేతత్ క్షమస్వా
శివ శివ కరుణాబ్ధే
శ్రీ మహా దేవ శంభో
నమస్తే నమస్తే నమస్తే నమః
తకిట తక తక తకిట
చకిత పద యుగళా
నికట గంగా సహిత
మకుట గళ నిగళా
హరిహరాంచిత
కలా కలిత నీల గళా
సాంద్ర చ్చటా పటల
నిటల చంద్ర కళా
జయ జయ మహా దేవ
శివ శంకరా
హర హర మహా దేవ
అభయంకరా
౨
అని దేవతలు
శివుని కొనియాడ
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనంతలో కైలాస మావేళ
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల
౩
జగము లేలిన వాని
సగము నివ్వెర బోయె
సగము మిగిలిన వాని
మొగము నగవై పోయె
౪
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
౫
అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు
అనితర సాధ్యము పాశు పతాస్త్రము
కోరి ఇంద్రగిరి చేరి
శివునికై
అహోరాత్రములు
చేసెను తపస్సు
ఇది సృష్టించెను
దివ్య మహస్సు
౬
నెలవంక తలపాగ
నెమలి ఈకగ మారె
తల పైని గంగమ్మ
తలపు లోనికి బారె
నిప్పులుమిసే కన్ను
నిదురోయి బొట్టాయె
బూది పూతకు మారు
పులితోలు వలువాయే
ఎరుక గల్గిన శివుడు
ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారె
తాను ఎరుకతగా
ఓంకార ధనువుగా
ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి
కదలి వచ్చెను శివుడు
౭
శివుని ఆనతిని
శిరమున దాల్చి
మూకాసురుడను
రాక్షసుడు
వరాహ రూపము
ధరించి వచ్చెను
ధరా తలమ్మే
అదిరి పోవగా
౮
చిచ్చర పిడుగై
వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో
అర్జునుడు
మట్టు పెట్టగా
పట్టె బాణము
ధనువొక చేతను
అందుకొని
చూసిన కంటను
చూడకనే
గురి చూసినంతనే
వేసినంతనే
౯
తలలు రెండుగా
విల విల లాడుచు
తనువు కొండగా
గిర గిర తిరుగుచు
అటు ఇటు తగిలిన
రెండు బాణముల
అశువులు వీడెను
వరాహము
౧౦
కొట్టితి నేనని
అర్జునుడు
పడగొట్టితి నేనని
శివుడూ
పట్టిన పట్టును
వదలకనే
తొడ గొట్టిన
బీరముతో అపుడూ
౧౧
వేట నాది
వేటు నాది
వేటాడే చోటు నాది
ఏటి తగవు పొమ్మని
విలు మీటి పలికే శివుడు
చేవ నాది
చేత నాది
చేటెరుగని
ఈటె నాది
చేవుంటే రమ్మని
కను సైగ చేసె
అర్జునుడు
౧౨
గాండీవ పాండిత్య కళలుగా
బాణాలు కురిపించె అర్జునుడు
కాని
అపుడతడు
వేయి చేతుల కార్త వీర్యార్జునుడు
ఓంకార ఘన ధనుష్టంకారముల తోడ
శర పరంపర కురిసె హరుడు
అయినా
నరుని కాతడు
మనోహరుడు
౧౩
చిత్రమేమొ
గురిపెట్టిన బాణమ్ములు
మాయమాయే
విధి విలాసమేమో
పెట్టిన గురి
వట్టిదాయే
అస్త్రములే విఫలమాయె
శస్త్రములే వికలమాయే
సవ్య సాచి కుడి ఎడమై
సంధించుట మరచిపోయే
౧౪
జగతికి సుగతిని
సాధించిన తల
దిగంతాల కవతల
వెలిగే తల
గంగకు నెలవై
కళ కాధరువై
హరి బ్రహ్మలకు
తరగని పరువై
అతి పవిత్రమై
అఘన మిత్రమై
శ్రీకరమై
శుభమైన
శివుని తల
అదరగా
సృష్టి చెదరగా
తాడి ఎత్తు
గాండీవము తో
ముత్తాడి ఎత్తుగా
ఎదిగి అర్జునుడు
చండ కోపమున
కొట్టినంతనే
౧౫
తల్లి దండ్రుల చలువ
తనువైన దేవుడు
కోరిన వరాలిచ్చు
కొండంత దేవుడు
ఎదుట నిలిచెను శివుడు
ఎద లోని దేవుడు
పదము లంటెను నరుడు
భక్తి తో అపుడు
౧౬
కర చరణ కృతం వా
కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా
మానసం వాపరాధం
విహిత మవిహితం వా
సర్వమేతత్ క్షమస్వా
శివ శివ కరుణాబ్ధే
శ్రీ మహా దేవ శంభో
నమస్తే నమస్తే నమస్తే నమః