Friday, September 23, 2011

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

To listen to the song:
http://www.youtube.com/watch?v=NFafB5EuEDU






ఎప్పుడూ
ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ
వదులుకోవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు
ఏ క్షణం
విస్మరించవద్దు
నిర్ణయం

అప్పుడే
నీ జయం
నిశ్చయం రా

ఎప్పుడూ
ఒప్పుకోవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దదైన
రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు
తక్కువేనురా

సంద్రమెంత గొప్పదైన
ఈదుతున్న చేప పిల్ల
మొప్ప ముందు
చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి
రవిని మింగు అసుర సంధ్య
ఒక్కనాడు
నెగ్గలేదురా

గుటకపడని అగ్గి ఉండ
సాగరాల నీదుకుంటు
తూరుపింట
తేలుతుందిరా

నిశా విలాసమెంతసేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడా
రాహువు కబళించలేని
సూర్య గోళ మంటిదేనురా

ఎప్పుడూ
ఒప్పుకోవద్దురా ఓటమి

నొప్పి లేని నిమిషమేది
జననమైన మరణమైన
జీవితాన
అడుగు అడుగునా

నీరసించి నిలిచిపోతే
నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే
నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్నా
సైన్యముండునా

ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము
సారధౌనురా

నిరంతరం
ప్రయత్నమున్నదా
నిరాశకే
నిరాశ పుట్టదా

ఆయువంటు వున్ననాళ్ళు
చావు కూడా నెగ్గలేక
శవము పైనే
గెలుపు చాటురా

ఎప్పుడూ
ఒప్పుకోవద్దురా ఓటమి

No comments:

Post a Comment